Monday, April 29, 2024

Followup : భారీ లాభాల్లో మార్కెట్లు.. దన్నుగా నిలిచిన సెన్సెక్స్‌..

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మెటల్‌, ఎనర్జీ రంగాల కారణంగా సూచీలు పైకి ఎగబాకాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయ్యింది. ఉదయం సెన్సెక్స్‌ 53,285.19 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54,399.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,176.02 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1344.63 పాయింట్ల భారీ లాభంతో.. 54,318.47 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఉదయం 15,912.60 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,284.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,900.80 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 438.15 పాయింట్ల లాభంతో.. 16,280.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.47 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

అన్ని షేర్లు లాభాల్లోనే..

సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఐటీసీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. లోహం, ఇంధనం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు రాణించడంతో మార్కెట్లకు భారీ లాభాలు వచ్చాయి. దీనికితోడు గత 15 నెలల్లో సూచీలు ఈ స్థాయిలో ఎగబాకడం రెండో సారి. అదేవిధంగా మదుపరులు కనిష్టాల వద్ద కొనుగోళ్లు చేపట్టారు. సూచీలు ఇప్పటికే భారీ నష్టపోయాయి. ఇక మళ్లి కరెక్షన్‌ ఉండదని భావించిన ఇన్వెస్టర్లు.. కొనుగోళ్ల వైపు పరుగులు పెట్టారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా తయారీ, సేవా రంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మరోవైపు కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడంతో వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. విమానయ ప్రయాణాలు పెరుగుతుండటంతో పాటు జీఎస్‌టీ కలెక్షన్లు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement