Thursday, May 2, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మూడో రోజూ నష్టపోయిన సూచీలు

వరసగా మూడో రోజూ కూడా స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం నాడు ఉదయం మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లో వెళ్లాయి. ఇంట్రాడేలో కనిష్టాలను నమోదు చేశాయి. దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కొద్దిగా కోలుకున్నప్పటికీ, నష్టాల నుంచి బయటపడలేదు. చైనాలో కొవిడ్‌ విజృంభణతో మన దేశంలోనూ ప్రభుత్వం అప్రత్తంగా ఉండాలని హెచ్చరించడంతో దాని ప్రభావం మార్కెట్లపై పడింది. ఐరోపా, అమెరి కాలో ఆర్ధిక మాంద్యం వస్తుందన్న అంచనాలు బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ 241.02 పాయింట్ల నష్టంతో 60826.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 71.75 పాయింట్ల నష్టంతో 18127.35 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 374 రూపాయలు తగ్గి 54697 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో1,063 రూపాయలు తగ్గి 68646 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.68 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ , సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, ఐసీఐసీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement