Wednesday, February 14, 2024

Breaking: మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురికి తీవ్రగాయాలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతరను పేల్చేశారు. పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో.. మీడియా ప్రతినిధి సహా ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడ్డ వారిని భద్రతా బలగాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంతెవాడ జిల్లా బార్ముర్ పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement