Sunday, December 8, 2024

మ‌నీష్ సిసోడియాకు నిరాశ – బెయిల్ కు కోర్టు నో

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న అప్ సీనియ‌ర్ నేత‌, ఢిల్లీ మాజా ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాకు కోర్టులో నిరాశ మిగిలింది.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆయ‌న దాఖ‌లు చేసిన బెయిల్‌ పిటిషన్ ను తోసిపుచ్చింది.. నిందితుడు సిసోడియాను విడుద‌ల చేసిన‌ట్ల‌యితే సాక్షుల‌పై ప్ర‌భావితం చేసే అవ‌కాశాలున్నాయంటూ సిబిఐ,ఈడీ త‌రుపు న్యాయ‌వాదుల చేసిన వాద‌న‌తో న్యాయ‌మూర్తి ఏకీభ‌వించారు.. దీంతో అత‌డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించారు.. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, ముడుపుల వ్యవహారంపై సిసోడియా పాత్ర ఉందంటూ ఈడీ ఆరోపించింది… ప్రస్తుతం సిసోడియా తిహార్ జై లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement