Wednesday, May 22, 2024

Manipur : భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య రీ పోలింగ్‌

మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11బూత్‌లలో రీ పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ 7గంటల వరకు జరగనుంది. మరోసారి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు పకడ్భంధీ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

ప్రస్తుత పోలింగ్ జరుగుతున్న బూత్‌లలో ఖురై అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. కాగా, ఈ నెల 19న జరిగిన లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో కొందరు దుండగులు ఈ పోలింగ్‌ కేంద్రాల వద్ద కాల్పులు జరిపి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించింది.

అంతకుముందు నిర్వహించిన పోలింగ్‌లో 69.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మిగిలిన బూత్‌లలో ఈ నెల 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా, మణిపూర్‌లో గతేడాది మే నుంచి కుకీ, మైతీ తెగల మధ్య హింస జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 65వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కుకీ తిరుగుబాటు దారులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement