Thursday, May 2, 2024

Black Mail – ఆర్మీ కి చుక్కలు చూపించి 12 మందిని విడిపించుకున్న మణిపూర్ మిలిటెంట్లు

ఇంపాలా – మణిపూర్ లోని ఇతాం గ్రామమది.. కార్డన్ సెర్చ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళం 12 మంది మిలిటెంట్లను ఆర్మీ అరెస్ట్ చేసింది..వారంతా మైతై మిలిటెంట్ గ్రూప్ (కంగ్లీ యావోల్ కన్న లుప్)కు చెందినవారని గుర్తించారు. ఆయుధాలు, మందుగుండుతో నిండి ఉన్న పలు ఇళ్లను కూడా ఆర్మీ సీజ్ చేసింది

ఈ వార్త తెలియడంతో దాదాపు 1500 మంది గుంపు వచ్చి ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళాన్ని చుట్టుముట్టింది.. ముందు వరుసలో మహిళలు.. ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు.. ఆర్మీ అరెస్ట్ చేసిన 12 మంది మిలిటెంట్లను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆర్మీ ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు..

ఇంత పెద్ద జన సమూహంపై కాల్పులు జరిపితే ప్రాణనష్టం జరిగే ముప్పు ఉంటుందనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్మీ 12 మంది మిలిటెంట్లను వారికి అప్పగించింది. శనివారం రోజు జరిగిన ఈ ఘటన ఆర్మీ ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement