Sunday, April 28, 2024

మంచు వారి అబ్బాయి రెండో పెళ్లి.. సెటైర్ వేసిన మనోజ్

మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. గతంలో వరుస సినిమాలు చేసిన మనోజ్.. ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించాడు. అయితే, 2015లో ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకున్న మనోజ్‌.. కొన్ని కార‌ణాల‌తో ఆమె నుంచి విడిపోయారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎక్కువ‌గా తిరుప‌తిలోని త‌న విద్యాసంస్థ‌ల ద‌గ్గ‌రే ఉంటున్నారు. అయితే మంచు మ‌నోజ్ త్వ‌ర‌లోనే మ‌రో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హల్ చల్ చేస్తున్నాయి.

దీంతో స్పందించిన మనోజ్.. తన పెళ్లికి తనను ఆహ్వానించాలని కోరాడు. త‌న రెండో పెళ్లి గురించి వార్త రాసిన లింక్ ను షేర్ చేస్తూ.. త‌న‌దైన శైలిలో సెటైరిక‌ల్‌గా కామెంట్స్ చేశాడు. పెళ్లికి నన్ను కూడా ద‌య‌చేసి పిల‌వండి. పెళ్లి జ‌రిగే స్థ‌లం ఎక్క‌డ‌.. ఆ బుజ్జి పిల్ల‌, తెల్ల పిల్ల ఎవ‌రు? అంతా మీ ఇష్టం రా మీ ఇష్టం ‘’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement