Friday, May 3, 2024

రిటైర‌యిన‌ కార్మికులు మ‌ళ్లీ విధుల్లోకి

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ఎస్​సీసీఎల్​ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి రిటైర్‌ అయిన అంద‌రికీ ఈ నిర్ణయం వర్తించనుందని సింగ‌రేణి యాజమాన్యం వెల్లడించింది. 61 ఏళ్లు నిండని విశ్రాంత ఉద్యోగులంతా ఈ నెల 31లోపు విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. మార్చి 31 నుంచి రిటైర‌యిన‌ 1082 మంది మ‌ళ్లీ విధుల్లోకి చేరాలని సింగ‌రేణి యాజ‌మాన్యం పేర్కొంది. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో 43,899 మందికి ప్ర‌యోజ‌నం చేకూరనున్నట్లు వివరించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగంలో చేరని పక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్క్‌ నో పేగా పరిగణిస్తారు. ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తిస్తారు. విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్‌ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్‌ అధికారులను సింగరేణి కోరనుంది.

ఇది కూడా చదవండిః జానారెడ్డికి ప‌ట్టిన గ‌తే ఈట‌ల‌కు: తలసాని

Advertisement

తాజా వార్తలు

Advertisement