Thursday, April 25, 2024

సింగ‌ర్ రేవంత్ కూతురిని చూశారా

సింగ‌ర్ రేవంత్ త‌న కూతురు వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.రేవంత్ పాపాయి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ కూతురిని చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీలవుతున్నారు. పాప చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ గా రికార్డులకు ఎక్కారు. కాగా రోజుల వ్యవధిలో రేవంత్ కి రెండు అరుదైన బహుమతులు అందాయి. ఒకటి బిగ్ బాస్ టైటిల్ కాగా, మరొక బహుమతి అందమైన బుజ్జాయి. రేవంత్ హౌస్ లో ఉండగా ఆయ‌న భార్యకి డెలివ‌రీ అయింది. బిగ్ బాస్ షోకి వెళ్లే నాటికి రేవంత్ వైఫ్ గర్భవతిగా ఉన్నారు. కూతురు పుట్టిన విషయాన్ని రేవంత్ కి బిగ్ బాస్ చెప్పారు. దీంతో రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కాగా టైటిల్ సాధించి నా కూతురికి బహుమతిగా ఇస్తానని చెప్పారు రేవంత్. చెప్పినట్లే రేవంత్ టైటిల్ గెలిచాడు, తన పాపకు గిఫ్ట్ గా ఇచ్చారు. రేపు ఆ పాప పెద్దయ్యాక రేవంత్ ఈ విషయాన్ని చాలా స్పెషల్ గా ఆమెతో పంచుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement