Sunday, October 17, 2021

సాంబార్ రుచిగా లేదని తల్లి, సోదరిని హత్య చేసిన వ్యక్తి

సాంబార్ రుచిగా లేద‌ని ఓ వ్య‌క్తి త‌న త‌ల్లి, సోద‌రిని హ‌త్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న కర్ణాటకలోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని దోడ్‌మ‌ణెలో చోటు చేసుకుంది. మ‌ద్యం మత్తులో ఉన్న వ్య‌క్తి.. భోజ‌నం చేసేందుకు కూర్చున్నాడు. సాంబార్‌తో భోజ‌నం చేస్తుండ‌గా, అది రుచిగా లేద‌ని త‌ల్లి, సోద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

అంత‌టితో ఆగ‌కుండా వారిద్ద‌రిపై నాటు తుపాకీతో అత‌ను కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. దీంతో త‌ల్లి, సోద‌రి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News