Tuesday, February 27, 2024

తల్లి ,తమ్ముడు,చెల్లి ని చంపేసి…ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా ?

కడపజిల్లా ప్రొద్దుటూరు లో దారుణం చోటు చేసుకుంది. తన విషయంలో కుటుంబ సభ్యులు సహకరించ లేదన్న కారణంతో ముగ్గురిని అతి కిరాతకంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఆపై పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ని హైదరఖాన్ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటి పెద్ద కొడుకు అయిన కరిముల్లా అనే వ్యక్తి కి తన భార్యతో గొడవ జరిగింది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించాలని కొద్దీ రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా ఈ వివాదం నేపథ్యంలో తెల్లవారు జామున అమ్మ ఇంటికి వచ్చిన కరిముల్లా నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో బాది హతమార్చాడు. తెల్లవారిన తరువాత కరిముల్లా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో ఈ ముగ్గురి హత్య వెలుగు చూసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement