Wednesday, May 1, 2024

మళ్లీ కూలీల వలస భాట…

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి రోజురోజుకి పెరుగుతుండడంతో రాష్ట్రంలోని ఇతర రాష్ట్ర కూలీలు మళ్లీ వలసెల్లిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఉన్న పరిస్థితులనే మహమ్మారి మళ్లి తీసుకురావడంతో అప్పటి కష్టాన్ని మరువని కూలీలు ఒక్కసారిగా వారి స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పెట్టబోమని ఒక వైపు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కూలీల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కూలీలు వెళ్లకుండా ఆపేందుకు ఆయా రంగాల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నాయి. కూలీల్లో భరోసా నింపడంతో పాటు వారు పనిచేసే ప్రదేశాల్లో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మందికి పైగా వలస కూలీలు వివిధ రంగాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నిర్మాణ రంగం, గ్రానైట్‌, రైస్‌ మిల్లులతో పాటు హోటళ్ల రం గంలో వీరే కీలకం కావడంతో వలసలతో ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా రైస్‌ మిల్లుల్లో సుమా రు లక్ష మందికి పైగా కూలీలు పనిచేస్తుండగా, భనవ నిర్మాణ రం గంలో సుమారు 4లక్షల మందితో పాటు మిగతా రంగా ల్లో కూడా వీరే ఎక్కువుగా ఉండడంతో ఆయా రంగాల బిజినెస్‌ పై ప్రభావం పడుతోంది. ఒకవేళ కరోనా తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూలీల్లో వ్యక్త మవుతుండడంతోనే వారు స్వస్థలాలకు వెళ్తున్నట్టు తెలు స్తోంది. దీంతో పాటు గతంలో మాదిరిగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తే ఎలా అనే ప్రశ్నలు కూడా వారిలో రేకెత్తుతున్నాయి.
కూలీలకు భరోసా కల్పిస్తూ..
వలస కూలీలంతా వారి స్వస్థలాలకు వెళ్లుతుండడంతో ఆయా రంగాల యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బందులు పడు తుండడంతో పాటు వారు వెళ్లకుండా ఉండేందుకు వారికి అవసరమైన వసతులు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. వారు పనిచేసే ప్రదేశాల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా గదు లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికైనా కరోనా సోకినట్టు నిర్ధారణ అయితే వారు ఉండేందుకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులు ఏ ర్పాటు చేసేందుకు యాజమాన్యాలు నిర్ణయించుకున్నా యి. ఒకవేళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా లాక్‌ డౌన్‌ ఉన్న న్ని రోజులు ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తామని కూడా కంపె నీలు హామినిస్తున్నాయి. కొంతమంది ఇప్పటికే కూలీలకు అవసరమైన కూరగాయలు, బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
వారు వెళ్లితే తీసుకువచ్చే ఖర్చుకంటే.. ఇక్కడుండే ఖర్చే తక్కువ..
గతేడాది కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని ఇతర రాష్ట్ర కూలీలంతా వారి వారి స్వస్థలాకు వెళ్లిపోయారు. అనంతరం వారిని మళ్లి తీసుకువచ్చేందుకు ఆయా రంగాల వారే ఖర్చుల భరించాల్సి వచ్చింది. ఇదీకాక కూలీలకు అదనంగా మళ్లి కొంత డబ్బును ఇవ్వాల్సి వచ్చిందని ఓ హోటల్‌ యజమాని చెప్పారు. వారు గ్రామాలకు వెళితే తీసుకువచ్చే ఖర్చు కంటే కూలీలను ఇక్కడే ఉంచి వసతులు ఏర్పాటుచేస్తే ఖర్చు తగ్గు తుందని పలు రంగాల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలుచోట్ల కూలీలకు వసతులు కల్పిస్తున్నారు.
కీలకంగా ఆ రాష్ట్రాల వారే..
తెలంగాణలోని రైస్‌ మిల్స్‌, నిర్మాణ రంగం, గ్రానైట్‌ రంగం, హోటల్స్‌తో పాటు తదితర రంగాల్లో బీహార్‌, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కూలీలు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరితో పాటు మిగతా రాష్ట్రాల వారు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఈ రంగాల్లో వారే కీలకం కావడంతో పాటు రైస్‌ మిల్స్‌కు ఇపుడు ధాన్యం వచ్చే సమయం కావడంతో వారు గ్రామాలకు వెళ్తే ఇబ్బం దులు తప్పవని రైస్‌ మిల్స్‌ యజమానులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని కీలకమైన ప్రాజెక్టుల్లో పనిచేసే వారు కూడా వీరే కావడంతో కూడా యాజమాన్యాలు ఆందోళన చెందు తు న్నాయి. కూలీలంతా స్వస్థలాలకు వెళితే రూ.కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉండొచ్చని ఆయా రంగాల వారు చెబుతున్నారు.
ఢిల్లిలో లాక్‌డౌన్‌… కూలీలు ఆందోళన
తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీ ఆర్‌ చెప్పినప్పటికీ దేశ రాజధాని ఢిల్లిలో లాక్‌డౌన్‌ విధిం చడంతో కూలీలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కష్టా లను గుర్తు తెచ్చుకుని ముందుగానే వారి స్వస్థలాకు పయ నమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో కూలీల వలసలు ఆగేలా లేదన్నట్టు పరిస్థితులు ఏర్పడ్డాయి.
కిటకిటలాడుతున్న బస్‌, రైల్వే స్టేషన్లు
లాక్‌డౌన్‌ భయంతో ముందుగానే వారి స్వస్థలాకు వెళు ్తన్న కూలీలతో రైల్వే, బస్‌ స్టేషన్లు రద్దీగా మారాయి. ఇప్పటికే కరోనా రెండో ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూలీల రాకతో రద్దీ పెరగడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కూలీల వలసతో ఇబ్బందులు రావడంతో పాటు ఒకేసారి అందరూ గుమిగూడి ప్రయాణాలు చేయడం కూడా తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందేమోనని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement