Saturday, December 7, 2024

Maharastra – ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

ముంబై – కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు.

కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన – సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన యవత్మాల్‌ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement