Friday, May 17, 2024

రేపే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ రిలీజ్ -ట్వీట్ చేసిన చిత్ర యూనిట్

ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. మొద‌టి సారిగా హీరో నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వరుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటిని పెంచుతున్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ శ‌నివారం విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ట్రైల‌ర్‌కు స‌ర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుద‌ల చేశారు. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్ట‌ర్‌గా క‌నిపించనున్నారు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి స్వ‌రాల‌ను స‌మ‌కూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement