Friday, May 3, 2024

మ‌రోసారి ఐటెంసాంగ్ లో హీరోయిన్ అంజ‌లి – పోస్ట‌ర్ రిలీజ్

ఈ మ‌ధ్య‌కాలంలో ఐటెంసాంగ్స్ లో స్టార్ హీరోయిన్స్ న‌టిస్తున్నారు. అదే బాట‌లో హీరోయిన్ అంజ‌లి కూడా న‌డుస్తోంది. స‌రైనోడులో స్పెష‌ల్ సాంగ్ లో మెరిసిన అంజ‌లి మ‌రోసారి ఐటెంసాంగ్ లో మెర‌వ‌నుంది. యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ చిత్రం మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం . నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నారు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని స్పెష‌ల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ న‌టి అంజలి ఈ పాట‌లో న‌టించ‌నుంద‌ని పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement