Friday, May 3, 2024

మాచ‌ర్ల ధ‌మ్కీ వీడియో- ఈ నెల 30న ట్రైల‌ర్ రిలీజ్

హీరో నితిన్ న‌టిస్తున్న ..త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తోన్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ..ఈ చిత్రం నుండి మాచ‌ర్ల ధ‌మ్కీ వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో నితిన్ ప్రభుత్వ అధికారిగా నటించగా, ఆయన సరసన నాయికలుగా కేథరిన్ – కృతి శెట్టి అలరించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘మాచర్ల ధమ్కీ’ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు. మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాదిమంది తమ సమాధులను పునాదులుగా వేశారు .. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధమ‌ని ఈ వీడియో సాగింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement