Sunday, April 28, 2024

రష్యా చేతికి లుషాంక్‌! ప్రకటించిన రక్షణ మంత్రి సెర్జీ..

కీవ్‌:ఉక్రెయిన్‌ దాడులతో బెంబేలెత్తి స్నేక్‌ ఐలాండ్‌ను ఖాళీ చేసి వెళ్లిన రష్యా తూర్పు ఉక్రెయిన్‌పై మాత్రం చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. లుషాంక్‌ ప్రావిన్స్‌లోని కీలక పట్టణం లిసిచాన్‌స్క్‌ను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్జి షొయ్‌గు ఆదివారం ప్రకటించారు. దీంతో లుషాంక్‌ ప్రావిన్స్‌కు విముక్తి కల్పించినట్టయిందని పేర్కొన్నారు. ఈ విజయం గురింతి అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే, రష్యా ప్రకటనను ఉక్రెయిన్‌ ఖండించింది. తూర్పు డోన్‌బాస్‌ పరిథిలోని లుగాన్స్‌, లిసిచాన్‌స్క్‌ ఇంకా తమ చేతుల్లోనే ఉన్నాయని, రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కాగా లిసిచాన్‌స్క్‌పై పట్టుకోసం ఉక్రెయిన్‌ క్షిపణులను ప్రయోగించిందని, అయితే మధ్యోలనే తమ బలగాలు వాటిని కూల్చేశామని బెలారస్‌కు చెందిన యుద్ధనేత అలెగ్జాండర్‌ లుకషెంకో ప్రకటించింది.

ఉక్రెయిన్‌ ఎదురుదాడులు..

రష్యా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ లొంగడం లేదు. ఎదురు దాడులతో రష్యాకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా రష్యా సరిహద్దు గ్రామం బెల్‌గొరొడ్‌పై బాంబులతో దాడులు చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్‌ వ్యాచెస్లావ్‌ గ్లాడకోవ్‌ ప్రకటించారు. ఆ దాడుల్లో 11 భవనాలు, 39 ఇళ్లు ధ్వంసమయ్యాయని, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మరోవైపు రష్యా ఆక్రమించుకున్న మెలిటొపోల్‌లో ఆ దేశ సైనిక స్థావరంపై ఉక్రెయిన్‌ విరుచుకుపడుంది. రష్యా సైనిక స్థావరంపై దాదాపు 30 సార్లు బాంబులతో దాడి చేసింది. ఈ విషయాన్ని రష్యా బలగాలు ధ్రువీకరించాయి. కాగా ఉక్రెయిన్‌ దాడులతో ఆయుధాలను తీసుకువెడుతున్న రైలు దెబ్బతిందని, అవియోమిస్టెచ్కోలో ఎయిర్‌పోర్టు దెబ్బతిందని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement