Saturday, May 18, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు (23, 24, 25) తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, మహమూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రంలో పసుపు (ఎల్లో అలర్ట్‌ ) హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు జలాశయాల్లోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పాత నిర్మాణాలు, మట్టిగోడల నిర్మాణాల్లో తలదాచుకోవద్దని హెచ్చరించింది. కాగా… గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 3.2 మి.మీలు, భద్రాచలంలో 5.4 మి.మీలు, మహబూబ్‌నగర్‌లో 0.6 మి.మీలు, ఖమ్మంలో 6 మి.మీల వర్షపాతం కురిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement