Sunday, April 28, 2024

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు లోకాయుక్త కీలక ఆదేశాలు

కరోనా వేళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌(HPS)అధిక ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46కు విరుద్ధంగా ట్యూషన్ రుసుములే కాకుండా ఇతర ఫీజులను వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూలుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని HPS ఛైర్మన్, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిపైనా ఆరోపణలు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు లింక్ ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని, ఈనెల 26న జరిగే విచారణకు హాజరుకావాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిని లోకాయుక్త జస్టిస్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement