Monday, April 29, 2024

చిరుతపులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్న అధికారులు…

హవేళిఘణపూర్‌, (ప్రభన్యూస్‌) : హవేళిఘణపూర్‌ మండలంలో సోమవారం చిరుతపులి సంచారం చేస్తుండగా హవేళిఘణపురం పోలీసులు నైట్‌ పెట్రోలింగ్‌ వెళ్లే సమయంలో గాజురెడ్డిపల్లి, సర్దన దారిలో చిరుతపులి సంచరిస్తున్న ఈ సమయంలో పోలీస్‌ సిబ్బంది సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించి బూర్గుపల్లి, గాజురెడ్డిపల్లి, సర్దన, జక్కన్నపేట గ్రామాల వాట్సాప్‌ గ్రూపులలో ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మెదక్‌ డీఎఫ్‌వో రవిప్రసాద్‌ మాట్లాడుతూ చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు రాత్రి సమయంలో బయట తిరగవద్దని ఆయన తెలిపారు. చిరుతపులి ప్రాంతానికో ఒకే దగ్గర మాటు వేసుకొని ఉండదని దాని ఆహారం కోసం కొత్తకొత్త ప్రాంతాలకు వెళుతుందని ఆయన తెలిపారు.

రాత్రి సమయంలో బైకులపై కానీ కాలినడకన వెళ్లే వారు కానీ అడవి ప్రాంతంలో ఉన్న గ్రామాల వ్యవసాయదారులు పొలాల వద్దకు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లాలని సూచించారు. గతంలో కూడా ఈ గ్రామాలలో చిరుతపులి వాటి పిల్లలు అంతరించి వెళ్లాలని చాలా మంది వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేవారు. అటవీశాఖ అధికారులకు తెలిపారని గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుండి కొత్త ప్రాంతానికి వెళ్లే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. రాత్రి పూట వ్యవసాయ బోర్ల వద్ద ఎవరు కరెంటు పెట్టరాదని సంఘటన ఏదైనా దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement