Monday, April 29, 2024

బోయింగ్‌లోనూ కోతలు.. 2వేల మంది సిబ్బందిపై వేటు

అంతర్జాతీయంగా పలు దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌లుతో వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. ఇంకా వేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ కూడా అదే బాటులో నడుస్తోంది. కంపెనీలో పని చేస్తున్న 2000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బోయింగ్‌ ప్రకటించింది. తొలగించిన వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తుందని వార్తలు వచ్చాయి. ఇంజినీరింగ్‌, తయారీ విభాగంలో దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించిన బోయింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగంలో ఉద్యోగులను తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది.
ఉత్పత్తి, సర్వీస్‌లు, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని బోయింగ్‌ తెలిపింది.

- Advertisement -

ఈ లోటును భర్తీ చేసేందుకు ఔట్‌ సోర్సింగ్‌ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపింది. ఇంజినీరింగ్‌, మ్యానుప్యాక్చరింగ్‌ విభాగంలో మరింత మంది సిబ్బందిని నియమిచుకోనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరం 15 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు బోయింగ్‌ ప్రకటించింది. ఈ సంవత్సరం కూడా మరో 10 వేల మందిని రిక్రూట్‌ చేసుకుంటామని పేర్కొంది. గతంలో 2018, 2019లో జరిగి రెండు అతి పెద్ద విమాన ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. బోయింగ్‌కు చెందిన ఈ విమానాల్లో తయారీలో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా కంట్రోల్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపం బయటపడింది.

ఈ నేపథ్యంలోనే తయారీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న బోయింగ్‌ ఇతర విభాగాల్లోని సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్‌ సిబ్బంది సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు విమానయాన సంస్థలు 737 మ్యాక్స్‌ విమానాలకు అర్డర్లు భారీగా ఇచ్చాయ. మన దేశం నుంచి టాటా గ్రూప్‌ కూడా బోయింగ్‌ విమానాల కోసం భారీ ఆర్డర్‌ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement