Saturday, May 4, 2024

లాఠీ టీజ‌ర్ లాంచ్ కి ప్లాన్-వీడియో రిలీజ్

ఎ.వినోద్ కుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం లాఠీ. ఈ మూవీలో హీరోగా విశాల్ న‌టిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రానా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ, నంద సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ సినిమా టీజ‌ర్ జూలై 24న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే టీజ‌ర్ ప్రోమోను కూడా మేకర్స్ విడుద‌ల చేశారు. తాజాగా చిత్ర‌బృందం టీజ‌ర్ లాంచ్‌కు సిద్ధ‌మవుతున్న‌ట్లు ఓ వీడియోను విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో సినిమా క్రూ మెంబ‌ర్స్ టీజ‌ర్ లాంచ్‌కు ప్లాన్ సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఆగ‌స్టు 11న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ షూటింగ్ స‌మ‌యంలో విశాల్ రెండు సార్లు మేజ‌ర్‌గా గాయ‌ప‌డ‌టంతో చిత్రీక‌ర‌ణ‌ లేట్ అయింది. దాంతో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 15కు పోస్ట్ పోన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement