Thursday, April 18, 2024

స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్ డే వేడుక‌లో లాఠీఛార్జ్.. ప‌రుగులు తీసిన ఫ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ రీసెంట్ గా త‌న 57వ బ‌ర్త్ డేని జ‌రుపుకున్నారు. కాగా ఆయ‌న‌కి శుభాకాంక్షలు చెప్పేందుకు ముంబైలోని ఆయన నివాసం వద్దకు అభిమానులు పోటెత్తారు. సల్మాన్ పోస్టర్లు, బ్యానర్లను పట్టుకొని వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో సల్మాన్ తన బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

తన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి వచ్చిన సల్మాన్ అభిమానులను పలుకరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఫ్యాన్స్ ముందుకు తోసుకువచ్చారు. గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ ఒకరినొకరు నెట్టుకోవడంతో నటుడి పుట్టినరోజు వేడుకలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. అయి జనం అదుపు తప్పడంతో పోలీసులు కొందరిపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పోలీసులు లాఠీచార్జి ప్రారంభించిన వెంటనే అభిమానులు తమ పాదరక్షలు, ఇతర వస్తువులను వదిలి పారిపోయారు.

https://twitter.com/gchahal/status/1607763587858321414
Advertisement

తాజా వార్తలు

Advertisement