Saturday, October 5, 2024

Latest | ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా… ప్రశాంత్ నీల్ దర్శవత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘‘సలార్’’. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ సీజ్‌ఫైర్ డిసెంబర్ 22వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా, ప్రేక్షకులు, అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు మరో కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్, గరుడ రామచంద్రరాజు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సిమ్రత్ కౌర్ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. రవి బస్రూస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement