Wednesday, May 1, 2024

లారెన్స్ కొత్త రూపం..

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా కతిరేశన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’ పాన్‌ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటు-ంది.
ఏప్రిల్‌ 14 న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ ప్రకటన పోస్టర్‌లో లారెన్స్‌ సూపర్‌ ్టసలిష్‌గా కనిపిస్తున్నారు. కతిరేశన్‌ సమర్పకులుగా వ్యవహరి స్తున్నారు. నిర్మాత ఠాగూర్‌ మధు థియేట్రికల్‌ రైట్స్‌ తీసుకున్నారు.
లారెన్స్‌ కు జోడిగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ డి రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement