Friday, April 19, 2024

ఆలయ ఆస్తులు పరిరక్షించాలి..

  • దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన
  • కలెక్టర్కు వినతి పత్రం అందజేత

నిజామాబాద్ సిటీ, మార్చి (ప్రభ న్యూస్) : ఇందూర్ జిల్లాలో దేవాలయ భూములు ఆస్తులను కాపాడాలని, శంభుని, నీలకం టేశ్వర ఆలయ దేవాలయల ఆవరణలో అక్రమంగా ఉన్న అన్యమతస్థుల దుకాణాలను వెంటనే తొలగించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేశారు. సోమవారం దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సద్బు ద్ధిని, ఆలోచనను దేవాదా యశాఖ అధికారులకు యజ్ఞ భగవానుడు,ఆ సదా శివుడు కలిగించాలని వేడుకుంటూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు హోమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఆలయ భూములను పరిరక్షించి అన్యమతస్తుల దుకాణాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా దేవాలయ పరిరక్షణ సమితి శంభుని గుడి కోసం శాంతియుతంగా పోరా డుతూనే ఉన్నదని తెలిపారు. శంభుని గుడి స్థలాన్ని ఆక్రమిం చి నిర్మించిన దుకాణాలను వెంటనే తొలగించాలని అధికా రిక ఉత్తర్వులు వచ్చినప్పటికీ స్థానిక అధికారుల అలసత్వం కారణంగా ఇంతవరకూ ఆ అక్ర మ దుకాణాలను తొలగించ లేదనీ వాపోయారు. ఇప్పటి కైనా అధికారులు అలసత్వం వీడి దేవాలయాన్ని,దేవుడి ఆస్తులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ ప్రవీణ్, బంటు రామ రాజు, ప్రతాప్ ,సుక్కరాజు, గోపి,రవి దినేష్ మహేష్, ధీరజ్, దినేష్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement