Monday, April 29, 2024

భూములు, ప్లాట్లు వేలానికి రెడీ.. 14నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలో వేలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను డెవలప్‌చేసి రూ.వేల కోట్ల లక్ష్యం దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నది. గతేడాది కోల్పోయిన పన్నేతర ఆదాయా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నిఏవదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నది. తద్వారా రూ.20వేల కోట్ల లక్ష్యం చేరేందుకు కార్యాచరణ ముమ్మరం చేసింది.

హెచ్‌ఎండీఏ లేఅవుట్ల ప్లాట్ల వేలం రేపటినుంచే…

మరోసారి హెచ్‌ఎండీ అభివృద్ధి చేసిన లే అవుట్లలో పాట్ల ఆన్‌లైన్‌ వేలంతో భారీ రాబడికి ప్రభుత్వం సన్నద్ధమైంది. రేపటినుంచి ఆన్‌లైన్‌లో లాటరీల ద్వారా ప్లాట్ల కేటాయింపులకు రంగం సిద్థం చేశారు. కొనుగోలుదారుల కోసం ప్రీ బిడ్‌ సమావేశాలను నిర్వహించి,, లే అవుట్ల ప్రత్యేకతను ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో వివరించారు. బహదూర్‌పల్లి, తొర్రూర్‌, కుర్మల్‌గూడ, తుర్కయాంజాల్‌ ప్రాంతాల్లోని 359 ప్లాట్లను అత్యంత పారదర్శకంగా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీతో కలిసి ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియకు సర్వం సిద్దం చేశారు. రెండు షెషన్లలో ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను నిర్వహిస్తారు. చదరపు గజానికి కనీస్‌ బిడ్‌ పెంపుదల రూ. 500 చొప్పున పెంచాలని సూచించారు. ఏడు రోజులపాటు నిర్వహించే వేలం, లాటరీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నారు.

- Advertisement -

హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టిసారించింది. వీటితో మరో రూ.5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా నీటిపారుదల శాఖ పరిధిలో నిరుపయోగంగా ఉన్న నీరు, భూమి యామాన్య శిక్షనా సంస్థ (వాలంతరి)కి చెందిన 300ఎకరాలను కూడా లే అవుట్‌గా వేసి విక్రయించాలని భావిస్తోంది. ప్రేమావతిపేట, హిమాయత్‌సాగర్‌, టీఎస్‌ఈఆర్‌ఎల్‌కు 224 ఎకరాలు, కిస్మత్‌పూర్‌లలో వాలంతరికి 217ఎకరాల భూములున్నాయి. వీటికి చెందిన 300 ఎకరాలను విక్రయిస్తే రూ.3వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement