Tuesday, October 8, 2024

పాన్ ఇండియా ప్రాజెక్టుగా లాల్ స‌లామ్.. షూటింగ్ స్టార్ట్

పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది లాల్ స‌లామ్ చిత్రం.ఈ చిత్రంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ ను వదిలారు.ఈ సినిమాలో, విష్ణు విశాల్ .. విక్రాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఆల్రెడీ రజనీ చేస్తున్న ‘జైలర్’ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ క్రేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇది. లుక్ పరంగా కూడా కొత్త రజనీకాంత్ ని ప్రేక్షకుల ముందుంచే సినిమా ఇది. ఆయన మార్కెట్ కి తగినట్టుగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను లైకా వారు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement