Sunday, May 5, 2024

లాల్ సింగ్ చ‌డ్డా బాగుంది – మెగాస్టార్ చిరంజీవి కితాబు

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చ‌డ్డా. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగ చైత‌న్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. తాజాగా చిరు ఇంట్లో ఈ సినిమా ప్రివ్యూ షో ప్ర‌ద‌ర్శిత‌మైన‌ విష‌యం తెలిసిందే. ఈ ప్రివ్యూ షోను అమీర్‌ఖాన్‌తో కలిసి చిరు, నాగార్జున‌, రాజ‌మౌళి, సుకుమార్‌, నాగ చైత‌న్య వీక్షించారు. కామెడీ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కానుంది. ప్రివ్యూ ఫోటో కూడా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై చిరు ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ వీడియోను షేర్ చేశాడు. చాలా రోజుల క్రీతం జ‌పాన్‌లోని టోక్యో ఏయిర్‌పోర్ట్‌లో అమీర్‌ఖాన్‌ను క‌లిశాను. మా ఇద్ద‌రి మ‌ధ్య చిట్ చాట్ జ‌రిగింది.

ఈ చిట్ చాట్ అమీర్‌ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘లాల్ సింగ్ చ‌డ్డా’లో న‌న్ను కూడా భాగ‌మ‌య్యేలా చేసిందంటూ’ ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. అంతేకాకుండా త‌న ఇంట్లో ప్రివ్యూ వేసినందుకు అమీర్‌ఖాన్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. చిరు షేర్ చేసిన వీడియోలో ప్రివ్యూ అనంత‌రం అమీర్‌ను చిరు స‌త్క‌రించాడు. సినిమా బావుందంటూ ప్ర‌శంల‌తో ముంచెత్తాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్‌’కు రీమేక్‌గా తెర‌కెక్కింది. ఈ చిత్రంలో అమీర్‌కు జోడీగా క‌రీనా క‌పూర్ న‌టించింది. వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement