Friday, May 3, 2024

DC vs SRH | కుల్దీప్ స్పిన్ మాయాజాలం.. హైదరాబాద్ 4వికెట్లు డౌన్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ దుమ్మురేపాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ 32 బంతుల్లో 89 బాదాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 6 ఓవర్లలో 125 పరగులు బాదిన హైదరాబాద్.. ప‌వర్ ప్లే అనంతరం మూడు ఓవర్లలో 4 వికెట్లు కోల్సోయింది.

ఢిల్లీ బౌలర్లు తొలుత పరుగులు ఇచ్చినా.. కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో మూడు వికెట్లు పడిపోయాయి.. 7వ ఓవర్లో 46 పరుగుల వద్ద అభిషేక్ శర్మని ఔట్ చేయగా.. అదే ఓవర్లో ఐడెన్ మార్క్రామ్ ను పెవిలియన్ పంపాడు. 9వ ఓవ‌ర్లో డేంజ‌రెస్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. ఇక డాషింగ్ బ్యాటర్ క్లాసెన్ 10వ ఓవర్ మొదటి బంతికే అక్సర్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement