Wednesday, May 1, 2024

TSRTC | ఆవకాయ పచ్చడి తెచ్చిస్తం.. టీస్ఆర్టీసీ కొత్త ఆఫర్

వేసవి వచ్చిందంటే మన అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడే గుర్తొస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసి కాస్త నెయ్యి వేసి కలిపి తింటే ఆ రుచే వేరు. ఈ క్రమంలో అమ్మమ్మ చేసే కొత్త ఆవకాయను మిస్ అవుతున్నాం అనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు సులువుగా పంపించేలా ఏర్పాట్లు చేసింది.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు పంపించవచ్చని తెలిపారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు కాల్ సెంటర్ నెంబర్లు 040 – 23450033, 040 – 69440000, 040 – 69440069 ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement