Wednesday, May 1, 2024

KMM: కొత్త మున్సిపల్ కార్పొరేషన్ భవనం సిద్ధం.. ప్రాంభించనున్న మంత్రి కేటీఆర్

ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయా భవనం ప్రారంభోత్సవానికి సర్వత్ర సిద్దమైంది. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా నగర ప్రజలకు పౌర సేవలను చేరువచేయాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు ఖమ్మం గట్టయ్య సెంటర్లో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనంను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్దం అయింది.

ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించామన్నారు. ఖమ్మం నగర నడిబొడ్డున 4-ఎకరాల సువిశాలమైన స్థలంలో ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు రూ.22కోట్లతో రాబోయే తరాలకు సరిపోయే విధంగా అన్ని వసతులతో కార్యలయం తీర్చిదిద్దామని వివరించారు. 3వ ఫ్లోర్ లో క్యాంటీన్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.

సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయా నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, ఫినిషింగ్ పనులు కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లిఫ్ట్, రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ప్రహరీ, పార్కింగ్, గ్రీనరీ, టైల్స్, త్రాగునీటి వసతి, వెయిటింగ్ హాల్, పౌరుల వసతులు తదితర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రేటర్‌ హైద్రాబాద్ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

కాగా, మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మెన్ బచ్చు విజయ్, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement