Tuesday, May 21, 2024

ఆస్ట్రేలియాలో ఘనంగా KTR జన్మదిన వేడుకలు.

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్ లో సాయిరాం ఉప్పుఆధ్వర్యం లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు . ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో విశ్వామిత్ర మంత్రి ప్రగడ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్ లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ప్రవీణ్ లేదెళ్ళ, వేణు నాథ్ , సాయి యాదవ్ , ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల ,సురేష్ మండ, రాకేష్, సూర్య రావు ,అశోక్, బాలరాజు ,మిస్కీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement