Sunday, April 28, 2024

నీళ్ల హక్కులు కృష్ణార్పణం : ఎంపీ నామా నాగేశ్వరరావు

తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. రేవంత్ ఆరోపణలను నామ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ ప్రాజెక్టుల గురించి తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ప్రజల్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినవి కేవలం తాత్కాలిక కేటాయింపుల ఒప్పందం మాత్రమేనని, శాశ్వతంగా తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన గుర్తించాలన్నారు. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని, కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పజెప్పిందని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీదఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ నీళ్ల హక్కులుకృష్ణార్పణం అయ్యాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement