Friday, April 26, 2024

నేడు కేఆర్ఎంబీ సమావేశం.. గెజిట్ పై చర్చ

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స‌మావేశం ఇవాళ  కానుంది. జ‌ల‌సౌధ కార్యాల‌యంలో కేఆర్ఎంబీ చైర్మ‌న్ ఎంపీ సింగ్ నేతృత్వంలో జ‌రిగే ఈ స‌మావేశానికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నీటిపారుద‌ల శాఖ అధికారులు పాల్గొన‌నున్నారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లుపై చ‌ర్చించ‌నున్నారు. ఉమ్మ‌డి ప్రాజెక్టుల‌ను బోర్డు ప‌రిధిలోకి తెచ్చే అంశంపై చ‌ర్చించ‌నున్నారు.

మరోవైపు సోమవారం జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో గెజిట్‌ అమలుకు సంబంధించిన పలు అంశాలపై తెలంగాణ వాదనలను సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గట్టిగా వినిపించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతే కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను అమలు చేయాలని కోరారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక, తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు వాదించారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకునేదాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement