Friday, May 17, 2024

రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా కేఆర్​ సురేశ్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కె.ఆర్. సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సురేష్‌రెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం, జాతీయ రాజకీయాలపై అవగాహన, వివిధ అంశాలపై పట్టు, లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం సురేష్‌రెడ్డికి కలిసొచ్చిన అంశాలు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement