Sunday, May 5, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా..

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల పాయింట్స్ టేబుల్ లో 8, 9 స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 47వ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో కోల్‌కతా జ‌ట్టు 9 మ్యాచ్ లు ఆడ‌గా.. 3 మ్యాచ్ లు గెలిచి ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. హైదరాబాద్ జట్లు 8 మ్యాచ్ లు ఆడ‌గా… 3 మ్యాచ్ లు గెలిచి 5 మ్యాచ్ లు ఓడిపోయింది… దీంతో పాయింట్స్ టేబుల్ బాట‌మ్ ప్లేస్ లో సెటిల్ అయ్యాయి ఈ రెండు టీమ్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement