Monday, April 29, 2024

వేటకు సిద్ధమైన జైల‌ర్.. మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ క‌మింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ జైలర్‌. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్క‌తున్న‌ ఈ సినిమాపై ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు భారీ అంచనాలే నెలకొన్నాయి. టాలీవుడ్ మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న‌ సాలిడ్ హైప్ వెనుక ఇది మరొక కారణం.

- Advertisement -

కాగా, ఇవ్వాల కొద్ది సేపి క్రితం మూవీ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేక‌ర్స్. అందుకోసం మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ వీడియో ఎండింగ్ లో ఈ సినిమా ఆగస్ట్ 10న థియేట‌ర్స్ లో రిలీజ్ కానున్న‌ట్టు వెల్ల‌డించారు మేక‌ర్స్. ఇక‌, స్వాతంత్ర్య దినోత్సవ సెలవుల‌తో పాటు ఒక‌ లాంగ్ వీకెండ్ వ‌స్తుండ‌టంతో ఈ డేట్ మూవీ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు.

ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్య కృష్ణన్, జాకీ ష్రాఫ్, సునీల్, వసంత్ రవి, యోగి బాబు కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై కళానిధి మారన్ ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement