Sunday, April 28, 2024

మూడో టెస్టుకు అందుబాటులో కోహ్లీ : ద‌్ర‌విడ్

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టుకు కెప్టెన్‌ కోహ్లీ అందుబాటులో ఉంటాడని హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ తెలిపాడు. టీమిండియాలో సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు తెలుగు క్రికెట్‌ హనుమ విహారీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఓ ఏడాది లేదా రెండేళ్లు వేచి ఉండాలని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విహారీ 40పరుగులు సాధించి అజేయంగా నిలిచిన విషయాన్ని ద్రవిడ్‌ గుర్తుచేశాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ విహారీ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మిడిలార్డర్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలడని ద్రవిడ్‌ ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రహానె, పుజారా, కోహ్లీ తదితర సీనియర్‌ ఆటగాళ్లు కూడా కెరీర్‌ తొలినాళ్లలో వేచి ఉన్నారని ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు.

కాగా తొలిటెస్టులో టీమిండియా ఘనవిజయం సాధిస్తే రెండోటెస్టులో దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో కేప్‌టౌన్‌లో జరగనున్న మూడో టెస్టు ఇరుజట్లుకు కీలకం కానుంది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ మూడో టెస్టులో ఆడనున్నాడని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. మూడో టెస్టు జనవరి 11నుంచి 15వరకు కేప్‌టౌన్‌ వేదికగా జరగనుంది. మూడో టెస్టుకు సిరాజ్‌ దూరమవనున్నాడు. రెండో టెస్టులో గాయపడిన సిరాజ్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదని ద్రవిడ్‌ వెల్లడించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement