Friday, May 3, 2024

2011, జూన్​ 20వ తేదీ, నా జీవితంలో మరిచిపోలేనిది.. యాది చేసుకున్న‌ కింగ్ కోహ్లీ!

2011లో ఇదే రోజున రెడ్ బాల్ ఫార్మాట్‌లో గ్రేట్ విరాట్ కోహ్లీని ప్రపంచం మొదటిసారి చూసింది. ఈ రోజుకి టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. అతను 2011, జూన్ 20న వెస్టిండీస్‌తో జమైకాలోని కింగ్‌స్టన్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడ కోహ్లీ మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాలుగు పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇక‌ చివరికి ఫిడెల్ ఎడ్వర్డ్స్ చేతిలో అవుట్ అయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ ఎక్కువ పరుగులు చేయలేకపోయినప్పటికీ, అతనిలో దాగి ఉన్న ప్రతిభను క్రికెట్ అనలిస్టులు గుర్తించారు.

ఢిల్లీకి చెందిన బ్యాటర్ భారతదేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి.. అతను బ్యాటర్, కెప్టెన్‌గా పెద్ద ప్రభావాన్ని సృష్టించాడు. 109 టెస్టుల్లో విరాట్ 48.72 సగటుతో 28 సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక టెస్టు స్కోరు గురించి మాట్లాడితే.. 2019లో పుణె వేదికగా దక్షిణాఫ్రికాపై 254 పరుగులు సాధించాడు.

- Advertisement -

ప్రస్తుతం, ఈ భారత మాజీ కెప్ట‌న్ కింగ్​ కోహ్లీ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్నాడు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు అతను క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో 55.34 స్ట్రైక్ రేట్‌తో 8479 పరుగులు చేశాడు. ఇదే విష‌యాన్ని గుర్తుచేసుకుంటూ త‌న సోష‌ల్ మీడియా ఎంకౌంట్ లో పోస్ట్ పెట్టాడు కోహ్లీ..

తదుపరి మ్యాచ్​లు ఇవే..

ఇక.. మెన్ ఇన్ బ్లూ టీమ్​ వెస్టిండీస్‌తో జులై 12వ తేదీ నుండి రెండు-టెస్టులు, మూడు వన్డేలు-ఇంటర్నేషనల్స్ (ODIలు), ఐదు మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తో కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ (2023-25) ప్రారంభమవుతుంది.

భారత్ vs వెస్టిండీస్ పూర్తి షెడ్యూల్

IND vs WI 1వ టెస్ట్: జూలై 12 నుండి జూలై 16 వరకు – రాత్రి 7.30 వరకు – విండ్సర్ పార్క్, డొమినికా

IND vs WI 2వ టెస్ట్: 20 జూలై నుండి 24 జూలై – 7.30 pm – క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్

IND vs WI 1వ ODI: 27 జూలై – 7 pm – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్

IND vs WI 2వ ODI: 29 జూలై – 7 pm – కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్

IND vs WI 3వ ODI: 1 ఆగస్ట్ – 7 pm – బ్రియాన్ లారా స్టేడియం, ట్రినిడాడ్

IND vs WI 1వ T20I: 3 ఆగస్టు – 8 pm – బ్రియాన్ లారా స్టేడియం, ట్రినిడాడ్

IND vs WI 2వ T20I: 6 ఆగస్టు – 8 pm – ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా

IND vs WI 3వ T20I: 8 ఆగస్టు – 8 pm – ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా

IND vs WI 4వ T20I: 12 ఆగస్టు – 8 pm – సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా

IND vs WI 5వ T20I: 13 ఆగస్టు – 8pm – సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా

Advertisement

తాజా వార్తలు

Advertisement