Thursday, April 25, 2024

గాయం కార‌ణంగా ఇంగ్లంగ్ టూర్ కు దూర‌మైన కెఎల్ రాహుల్.. జ‌ర్మ‌నీలో చికిత్స

ముంబై: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కాగా, తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమయ్యాడు. గాయం తీవ్రంగా ఉండటంతో చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఈ నెలాఖరున లేదా జులై మొదటి వారంలో కేఎల్‌ రాహుల్‌ జర్మనీ వెళ్తారని జైషా వివరించారు. గత ఏడాది వాయిదా పడ్డ ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20లు భారత జట్టు ఆడనుంది. ఇందుకోసం రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఈ నెలాఖరున ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌ కోసం కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే కేఎల్‌ రాహుల్‌ గాయం తీవ్రకావడంతో చికత్స కోసం జర్మనీ వెళ్తున్నారు, ఆస్థానంలో మరొకరిని ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా క్రికెటర్లు గురువారంనాడు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌ పర్యటనకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, హనుమ విహారి, చతేశ్వర్‌పుజరా, రిషబ్‌ పంత్‌, కెఎస్‌ భరత్‌, రవీంద్ర జడేడా, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, ప్రసిద్‌ క్రిష్ణలను ఎంపిక చేయగా, 10మంది క్రికెటర్లు వెళ్లారు. మిగిలిన క్రికెటర్లు దేశీయంగా సౌతాఫ్రికాకతో జరుగనున్న టీ20 సిరీస్‌ అనంతరం ఇంగ్లండ్‌ వెళ్లారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement