Friday, September 22, 2023

వర్షం కార‌ణంగా ఆగిపోయిన శ్రీలంక- ఆస్ట్రేలియా మ్యాచ్‌..

పల్లెకెలె: ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య గురువారం పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకి మారింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకోగా, శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు దనుష్కా గుణతిలక 18, పథుమ్‌ నిసాంక 14 మరోసారి నిరుత్సాహ పరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ 36 కూడా ఎక్కువ సేపులో క్రీజులో నిలబడలేకపోయాడు.

ధనుంజయ డిసిల్వా 34, చరిత్‌ అస్లాంకా 13, డసున్‌ షనక 34, చమిక కరుణతర్నే 18, దునిత్‌ వెల్లాలగె 20, జెఫ్‌రే వండర్‌సే 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరారు. దీంతో 47.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 220 పరుగులు మాత్రమే చేసింది. ఈ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా ఆపేశారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement