Thursday, April 25, 2024

అయ్యర్.. టీమిండియా భవిష్యత్ ఆటగాడు: మోర్గాన్

ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోవడంపై కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. అక్టోబర్ 15 తమ రోజు కాదని, దురదృష్టం కొద్దీ ఫైనల్‌లో తాము ఓడిపోయామని మోర్గాన్ తెలిపాడు. ఫైనల్‌లో తాము ఓడిపోయినా.. ఈ సీజన్‌లో తమ ఆటగాళ్ల అంకితభావం, పట్టుదల చూసి గర్వపడుతున్నట్లు అతడు పేర్కొన్నాడు.

ఓపెనింగ్ విభాగంలో వెంకటేష్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తమ జట్టుకు మూలస్తంభాలుగా నిలిచారని కొనియాడాడు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్‌కు ఐపీఎల్ కొత్త వేదిక అని, ఈ అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నట్లు తెలిపాడు. వెంకటేష్ అయ్యర్ టీమిండియాకు భవిష్యత్ ఆటగాడు అంటూ జోస్యం చెప్పాడు. ఢిల్లీతో క్వాలిఫయర్-2లో సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించిన రాహుల్ త్రిపాఠి అద్భుత ఆటగాడు అంటూ కితాబిచ్చాడు. కాగా గతంలో 2012, 2014 సీజన్‌లలో కోల్‌కతా ఐపీఎల్ ఫైనళ్లకు చేరుకుని టైటిళ్లు సాధించింది. ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరి ఓడిపోవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement