Wednesday, April 24, 2024

త్వరలో సినీ పెద్దలలో కేసీఆర్ చర్చలు: మంత్రి తలసాని

సీనియర్ నటుడు మోహన్ బాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా’కు ఎన్నికయిన సభ్యులకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద వ్యవస్థ అని తెలిపారు. ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం , ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారని, తప్పును తప్పు అని ధైర్యంగా మోహన్ బాబు చెబుతారన్నారు. మోహన్ బాబు నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. మోహన్ బాబు కోపం ఆయనికే నష్టం చేసింది కానీ ఇతరులకు కాదన్నారు. తనకు నష్టం జరిగినా.. ఎదుటి వారికి మేలు జరగాలని కోరుకునే గొప్ప వ్యక్తి మోహన్ బాబు అని కొనియాడారు. తప్పును తప్పుగా ధైర్యంగా చెప్పే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుస్తాడని తనకు ముందే తెలుసని మంత్రి తలసాని అన్నారు. 10 రోజుల ముందే ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. హైదరాబాద్ సినిమా హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న తలసాని.. మంచు విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సినీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిర్మాతలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సింగిల్ విండో అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రజలంతా థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడాలని పిలుపునిచ్చారు. సినీ నటులంతా తమకు తోచిన సాయం చేస్తే 900 మందినే కాదు 9 వేల మందిని ఆదుకునే సత్తా ‘మా’కు ఉంటుందన్నారు.

సినిమా ఇండస్ట్రీని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలనని, దేశంలోనే ఆదర్శవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని మంత్రి తలసాని చెప్పారు. విష్ణులతో పాటు సినీ పెద్దలను త్వరలో ప్రభుత్వంతో చర్చలకు ఆహ్వానిస్తామని మంత్రి వెల్లడించారు. అర్హులైన కళాకారులకు పించన్లు, కల్యాణ లక్ష్మి,  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలు అందేలా చూస్తామని తలసాని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement