Wednesday, May 1, 2024

కిమ్‌ దూకుడు.. 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలు, అమెరికాను హెచ్చరించడానికే క్షిపణి పరీక్షలు

నార్త్‌ కొరియా: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా నమోదవుతున్నా, ఉత్తర కొరియా అధ్యక్షు డు కిమ్‌ మాత్రం క్షిపణి పరీక్షల్లో బిజీగా ఉన్నారు. కేవలం 35 నిమిషాల్లో 8 బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ ను అధ్యక్షుడు కిమ్‌ పరీక్షించారు. తద్వారా నార్త్‌ కొరియా న్యూక్లియర్‌ పరీక్షలకు సిద్ధంగా ఉందని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రోజులో 8 బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ ను పరీక్షించడం కూడా ఇదే మొదటసారని అధికారులు అంటున్నారు.

దీంతో ఈ ఏడాది నార్త్‌ కొరియా నిర్వహించిన మిస్సైల్‌ పరీక్షలు 18కి చేరింది. అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పేన్స్‌ సముద్రంలో సంయుక్త విన్యాసాలు చేయడం అందులో అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ రోనాల్డ్‌ రీగన్‌ కూడా పాల్గొవడం నార్త్‌ కొరియా అధ్యక్షుడికి కంటగింపుగా మారింది. అందుకే, దేశంలో కరోనా రక్షణ చర్యలు చేపట్టడం మానేసి క్షిపణి పరీక్షల్లో బిజీగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement