కన్న కొడుకును చంపి.. ఆతర్వాత తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అవడికి చెందిన మహ్మద్ సలీంకు భార్య సోఫియా, కుమారుడు అబ్దుల్ సలీం ఉన్నారు. వారి కుమారుడు వినికిడి, మాట లోపంతో బాధపడుతున్నాడు. దంపతులిద్దరూ వినికిడి సమస్య ఉన్న కొడుకు పరిస్థితి చూసి కలత చెంది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇరువురూ ఆత్మహత్య చేసుకున్నారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని సలీం అంతకుముందే తన సోదరికి మెసేజ్ చేశాడు. పంచనామా నిమిత్తం మృతదేహాలను కిల్పౌక్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే కొడుకును చంపి, తల్లిదండ్రులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..