Thursday, April 25, 2024

తేజస్వి ఆర్జేడీ చీఫ్ అవుతారని ప్రచారం.. వారంతా మూర్ఖులన్న లాలూ

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్ష పదవిపై లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చిన్న కుమారుడు తేజస్వి  యాదవ్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ వార్తలను ఖండించారు. తేజస్వి యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు అవుతున్నాడంటూ చెప్పినవాళ్లను పూల్స్ గా ఆయన అభివర్ణించారు. ఆర్జేడీ అధ్యక్షుడుగా తాను తప్పుకుంటున్నట్టు వచ్చిన వార్తలను లాలూ కొట్టి పడేశారు. పార్టీలో ఏం జరిగినా తామే చెబుతామని స్పష్టం చేశారు.

గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కోర్టు కేసులు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, పార్టీ పగ్గాలు మాత్రం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అయితే పార్టీలో లాలూ చిన్నకుమారుడు తేజస్వి యాదవ్ పట్టు సాధిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తేజస్వీని ప్రకటించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో తేజస్వీ యాదవ్ కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో స్పందించిన లాలూ.. ఆ ప్రచారం పుట్టిస్తున్నవారంతా ముర్ఖులని వ్యాఖ్యానించారు. పార్టీలో ఏం జరిగినా అది తామే చెబుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement