Saturday, May 4, 2024

శ్రీలంక అధికారులతో చైనా అత్యవసర భేటీ.. భారత్‌ ఒత్తిళ్లకు తలొగ్గిన శ్రీలంక

నిఘానౌక యువాన్‌ వాంగ్‌ 5 శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరే విషయంలో భారత్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సానుకూలంగా రణిల్‌ ప్రభుత్వం స్పందించడంతో చైనా అప్రమత్తమైంది. ఆగస్టు 7న చైనానుంచి బయలుదేరిన ఆ నౌక 11వ తేదీనాటికి హంబన్‌టోటకు చేరుకోవలసి ఉంది. కాగా ఈ విషయంలో భారత్‌ ఒత్తిళ్లకు తలొగ్గిన శ్రీలంక నౌకను ఇప్పుడే పంపవద్దని, కాస్త జాప్యం చేయాలని చైనాకు సూచించింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీలంక అధికారులను కొలంబోలోని చైనా దౌత్యసిబ్బంది కోరారు. కాగా చైనా దౌత్యవేత్త ఖి జెన్‌హాంగ్‌ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో రహస్యంగా సమావేసమైనట్లు తెలుస్తోంది.

అనుకున్న ప్రకారమే నౌకను అనుమతించాలని కోరినట్లు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే స్వస్థలానికి అత్యంత సమీపంలో హంబన్‌టోట నౌకాశ్రయం ఉంది. ఆయన హయాంలోనే చైనాకు అనుకూలంగా విదేశాంగ విధానాన్ని మార్చారు. చైనానుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకుని చెల్లించలేకపోయారు. తరువాత దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోవడం, గొటబాయ పరారవడం తెలిసిందే. శ్రీలంక కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోని చైనా ఇప్పుడు శ్రీలంకకు తమ నౌకను పంపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement