Tuesday, April 30, 2024

Presentation Cermony: చిరాగ్ – సాత్విక్ ల‌కు ఖేల్ ర‌త్న‌…ష‌మీ, ఇషాల‌కు అర్జున్ పురస్కారాలు …

న్యూ ఢిల్లీ – క్రికెట‌ర్ షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. అలాగే గతేడాది బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్‌ చంద్రశేఖర్‌ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌లకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నేడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా గ్ర‌హీత‌లు అవార్దులు స్వీక‌రించారు.. ఆసియా క్రీడ‌ల్లో ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన తెలంగాణ షూట‌ర్ ఇషా సింగ్, భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మద్ ష‌మీ, తో పాటు మ‌రో 24 మంది ప్రతిష్థాత్మక అర్జున అవార్డు అందుకున్నారు.

భార‌త క్రీడా రంగంలో ఖేల్ ర‌త్నఅవార్డు త‌ర్వాత రెండో అత్యుత్తన్నత అవార్డు అందుకున్న ష‌మీ త‌న క‌ల నిజ‌మైంద‌ని హర్షం వ్యక్తం చేశారు. ‘నా క‌ల నిజ‌మైంది. జీవితంలో చాలామందికి ఈ అవార్డు అందుకోవటం సాధ్యం కాదు. ఈ అవార్డుకు న‌న్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ష‌మీ తెలిపాడు. 2023కు గానూ 26 మంది అర్జున అవార్డు స్వీక‌రించారు. వీళ్లలో ఆసియా గేమ్స్‌లో ప‌త‌కాలు సాధించిన అథ్లెట్స్ అత్యధికులు ఉండటం విశేషం.

- Advertisement -

అర్జున అవార్డు గ్రహీతలు వీళ్లే
ఆర్చరీ – అథితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్రవీణ్ డియోట‌లే.
అథ్లెటిక్స్ – ప‌రుల్ చౌద‌రీ, శ్రీ‌శంక‌ర్ ముర‌ళి.
బాక్సింగ్ – మ‌హ్మద్ హుసాముద్దీన్.
చెస్ – ఆర్ వైశాలి.
క్రికెట్ – మ‌హ్మద్ ష‌మీ.
ఈక్వెస్ట్రియ‌న్ – అనుష్ అగ‌ర్వాల.
ఈక్వెస్ట్రియ‌న్ డ్రెస్సేజ్ – దివ్యక్రితి సింగ్.
గోల్ఫ్ – దిక్షా ద‌గ‌ర్.
హాకీ – కృష్ణన్ బ‌హదూర్ పాఠ‌క్, పుఖ్రంబం సుహిలా చాను.
క‌బ‌డ్డీ – ప‌వ‌న్ కుమార్, రీతు నేగీ.
ఖో ఖో – న‌స్రీన్.
లాన్ బౌల్స్ – పింకీ
షూటింగ్ – ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమ‌ర్. ఈషా సింగ్
స్క్వాష్ – హ‌రీంద‌ర్ పాల్ సింగ్ సాధు.

Advertisement

తాజా వార్తలు

Advertisement