Sunday, April 28, 2024

Delhi: ఇండియా కూట‌మి అధ్య‌క్షుడిగా ఖ‌ర్గే… స‌మ‌న్వ‌య‌కర్త‌గా నితీష్…

న్యూఢిల్లీ – కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను ఇండియా కూటమి అధ్యక్షుడిగా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను కూటమికి సమన్వయకర్తగా ఎన్నికయ్యారు. దాదాపుగా కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. ఇవాళ ఢిల్లీలో కూట‌మి స‌భ్యుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశానికి ముందే కోల్ క‌తాలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతి పాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు. ఇక, ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో హాజరు కాలేదు…

ఈ ఎంపిక పూర్తయిన త‌ర్వాత భాగ‌స్వామ్య పార్టీల మ‌ధ్య సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా ప్రధానంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలున్న పార్టీకే తొలి ప్ర‌ధాన్యం ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న ఈ స‌మావేశంలో పెట్టారు.. దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement